పల్లవి
వందనీయుడేసుని చేరండి కలవరమైనా కలతలు ఉన్నా పల్లవి: తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను
1వ చరణం
దేవుని తేజస్సు నిలచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా ||తొలగిపోవును||
2వ చరణం
సత్యము భోదించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది శ్రమలవలన చింతలైనా శత్రువులతో చిక్కులైనా ||తొలగిపోవును||
3వ చరణం
శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదుటపడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా ||తొలగిపోవును||