మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి

mandiramulooniki raarandi vandaneeyudeesuni cheerandi

🎵 TG-1824🌐 Telugu
పల్లవి

మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి (2) కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము||

1వ చరణం

దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా (2)       ||తొలగిపోవును||

2వ చరణం

సత్యము భోదించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదుటపడని రోగమైనా ఎదను తొలిచే వేదనైనా

Report Error