మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె

mangallamumbaadare kreesthunaku jaya mangallamumbaadare

🎵 TG-072💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళముఁబాడరె క్రీస్తునకు||

1వ చరణం

రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళముఁబాడరె క్రీస్తునకు||

2వ చరణం

కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ ||మంగళముఁబాడరె క్రీస్తునకు||

3వ చరణం

సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని ||మంగళముఁబాడరె క్రీస్తునకు||

Report Error