మరణమున్ జయించి లేచెను మన

marannamun jayinchi leechenu mana

🎵 TG-213💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్ జయించి||

1వ చరణం

మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ ||మరణమున్ జయించి||

2వ చరణం

నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్ జయించి||

3వ చరణం

వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్ జయించి||

4వ చరణం

కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్ జయించి||

5వ చరణం

మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్ జయించి||

6వ చరణం

మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్ జయించి||

7వ చరణం

అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్ జయించి||

Report Error