పల్లవి
మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా చాలా పాడరే వేలపాడరే ||మేలుకొని యిక||
1వ చరణం
పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలుకొని యిక||
2వ చరణం
అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలుకొని యిక||
3వ చరణం
తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలుకొని యిక||
4వ చరణం
జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలుకొని యిక||
5వ చరణం
నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలుకొని యిక||