ముఖ దర్శనం చాలయ్యా నాకు

mukha darshanam chaalayyaa naaku

🎵 TG-1561🌐 Telugu
పల్లవి

ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2)     ||ముఖ||

Report Error