ముందు కందరును జేరను ఎందు

mundu kandarunu jeeranu endu

🎵 TG-607💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ముందు కందరును జేరను ఎందు బోయినన్ గాపాడి తొందరల్మ ఱేమ్మిరాక బంధుఁడేసు నిన్ను గావుతన్ ||ముందు కందరును||

1వ చరణం

ఱెక్క నీడ నిన్నుఁ జేర్చుచు మిక్కుటంపు ప్రేమఁజూపిఁ చిక్కులాప తిల్లకుండ మక్కువన్ ప్రభుండుగావుతన్ ||ముందు కందరును||

2వ చరణం

నాఁడు నాడాహారమిచ్చుచు వేడుకన్ గౌగిటఁ జేర్చి కీడులందు నిన్ను గాంచి ఱేడునిన్నుఁ బ్రోచికావుతన్ ||ముందు కందరును||

3వ చరణం

చావు యొక్క భీతిలేకను జీవమార్గమందుఁ దోడై రేవుఁజేరుఁదాక బ్రోచి పావనుండు నిన్ను గావునన్ ||ముందు కందరును||

Report Error