మూడునాళ్ళ ముచ్చటకోసం ఈ మనిషి పడే తపన చూడరా

muuddunaalllla muchchattakoosan ii manissi paddee tapana chuuddaraa

🎵 TG-1277💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీటిబుడగ లాంటిది ఈ జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం

1వ చరణం

మనిషికి తన మనసే చెరసాలరా అవి మమతల మమకారాల బంధాలురా వళ్ళకాటి వరకేరా భవబంధాలు నీ కల్లానికి చేరవురా అనుబంధాలు కల్లలైన కలలు మానుకో ఎల్లవేళలా ప్రభుని వేడుకో ||మూడునాళ్ళ||

2వ చరణం

ఇంద్రధనస్సు లాంటిదోయి సంసారము అది కనిపించి మాయమయే రంగుల వలయం గడ్డిపువ్వు లాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం నిత్యమైన సుఖము వెదకరా నిరతము ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||

3వ చరణం

తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా జిగటగల ఊబి నుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువే తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా ||మూడునాళ్ళ||

Report Error