నా గీతారాధనలో యేసయ్యా నీ
naa geethaaraadhanaloo yeesayyaa nee
🎵 TG-2146🌐 Telugu
పల్లవి
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా||
1వ చరణం
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2) నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై