నా జీవితకాలమంత నిను కీర్తించిన

naa jeevithakaalamantha ninu keerthinchina

🎵 TG-2411🌐 Telugu
పల్లవి

నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత||

1వ చరణం

నా బాల్యమంతా నా తోడుగ నిలిచి ప్రతి కీడు నుండి తప్పించినావు యవ్వనకాలమున నే త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నను దైర్యపరిచి నను ఆదుకున్నావు యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు హృదయాశలన్ని నెరవేర్చినావు యోగ్యుడను కాకున్న హెచ్చించినావు ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నను హత్తుకున్నావు యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ

Report Error