నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం

naa jiivita yaatraloo prabhuvaa - nii paadamee sharannan

🎵 TG-1091💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఈలోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు

1వ చరణం

ఈ లోకనటన ఆశలన్నియు - తరిగి పోవుచుండగా మారని నీ వాగ్ధానములన్నియు - నే నమ్మిసాగెదను "నాజీవి"

2వ చరణం

పలువిధ శోధన, కష్టములు - ఆవరించు చుండగా కలత చెందుచున్న నా హృదయమును - కదలకకాపాడుము "నాజీవి"

3వ చరణం

నీసన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు నీదు కుడి హస్తములో నిత్యమున్న - నాకు సుఖక్షేమమేగా "నాజీవి"

Report Error