నా కింత ప్రోత్సాహా నందంబుల్

naa kintha proothsaahaa nandanbul

🎵 TG-348💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా కింత ప్రోత్సాహా నందంబుల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువై యుండు నాకు గల యున్నత కతమ్మే నాధుఁ డగును నేను మురియు శ్రీకరంబగు నామ మేది సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

1వ చరణం

ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది యెవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

2వ చరణం

నేను నా విధు లెల్ల నిశ్చయంబుగ నెఱుఁగ జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు వాని యెడల నను యధార్థ పరునిగాఁ గావించి యవినా చే నెరవేర్పించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

3వ చరణం

ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి యెవరు నా శోకంబు నెగురఁ గొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను నీడ్చి సేదను దీర్చి మనసు చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

4వ చరణం

మరణంలో నాకుఁ జిర జీవ మెవ్వారు మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు విరివిలేని మహిమ సేలు దరిని నుండఁగ నన్నుఁ జెంతను స్థిరముగ స్థాపించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

5వ చరణం

నన్ను రక్షింప మరణం బొందియు సమాధి నెన్నటికిని గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

Report Error