నా కొఱకుఁ చనిపోయి నాఁడ

naa korrakum chanipooyi naamda

🎵 TG-209💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ ||నా కొఱకుఁ||

1వ చరణం

ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక పూజింతు మీర ||నా కొఱకుఁ||

2వ చరణం

కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా కొఱకుఁ||

3వ చరణం

కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ ||నా కొఱకుఁ||

4వ చరణం

ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ మౌనమైయిలను ||నా కొఱకుఁ||

5వ చరణం

ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు కర్తను భజింతున్ ||నా కొఱకుఁ||

6వ చరణం

చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు సతము ||నా కొఱకుఁ||

Report Error