నా కృప నీకు చాలని

naa krupa neeku chaalani

🎵 TG-1747🌐 Telugu
పల్లవి

నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ (2)       ||నా కృప||

1వ చరణం

నేను నీకు తోడైయున్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2) నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2)      ||నాతో||

2వ చరణం

పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని

Report Error