నా ప్రాణప్రియుడా నా యేసురాజా

naa praannapriyudaa naa yeesuraajaa

🎵 TG-1353🌐 Telugu
పల్లవి

నా ప్రాణప్రియుడా నా యేసురాజా నా యేలినవాడా నా స్నేహితుడా (2) నిన్ను చేరాలని నీతో ఉండాలని నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2)         ||నా ప్రాణ||

1వ చరణం

నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా నీ ప్రేమను రుచి చూచితి నీ వశమైతిని యేసయ్యా నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా నిన్ను హత్తుకొని నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా

Report Error