నా ప్రియ యేసునిపై ఆనుకొని

naa priya yeesunipai aanukoni

🎵 TG-667💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటయే ఆనంద జీవితము ||నా ప్రియ||

1వ చరణం

లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ ||నా ప్రియ||

2వ చరణం

కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను ||నా ప్రియ||

3వ చరణం

ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ ||నా ప్రియ||

4వ చరణం

నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్ ||నా ప్రియ||

5వ చరణం

అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు ||నా ప్రియ||

6వ చరణం

దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును ||నా ప్రియ||

Report Error