నా యెడల నీకున్న తలంపులన్ని

naa yedala neekunna thalanpulanni

🎵 TG-1591🌐 Telugu
పల్లవి

నా యెడల నీకున్న తలంపులన్ని (2) ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య అవి రమ్యమైనవి అమూల్యమైనవి నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య నాకై నీవు తలంచుచున్నావా (2)          ||నా యెడల||

1వ చరణం

రాజువైన నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే అభిషేకించావు అధికారం ఇచ్చావు పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు నీకే స్తోత్రము యేసయ్య ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు

Report Error