నా యేసు! నా యాత్మ

naa yeesu! naa yaathma

🎵 TG-350💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా యేసు! నా యాత్మ బలమా! నీదు గాయంబులే నిలువబలమైన స్థలము సకల సృష్టి పునాదియపుడే నాదు సకల పాపములకై బలియైతి వేసు! సకల భూమ్యాకాశములను సమము గా గతించినఁగాని నీ ప్రేమ నిలుచు ||నా యేసు!||

1వ చరణం

నా తండ్రి! నీ నిత్య కృపను నెంచ నా తరమ? నీ ప్రేమ హస్తముల జూచి పాతకుల రండంచు బిలిచి వేగ నీదు కృప రుచి జీవంబు నిచ్చు ||నా యేసు!||

2వ చరణం

దరిలేని లోతైన ప్రేమా! నీలో దురిత యెల్లను మునిఁగి పోవు దరిలేని యుచిత కృపఁ జాటు నీదు రక్తంబు నా పాపడాగులను గడిగె ||నా యేసు!||

3వ చరణం

ఈ ప్రేమ సాగరంబున నే దుమికి నా ప్రభుని యెదదూరి విశ్రాంతి నొంది యే ప్రొద్దు సంతసించెదను నన్ను నా ప్రాణమును డాయదిఁక నరక మొందు ||నా యేసు!||

4వ చరణం

నా శిరముపై నలలురేగి యిలను నా సత్తువయు స్నేహితులు నన్ను వీడి నా సుఖము నా సంతసము బోయి నను నీదు కృప నన్ను విడిపోదు తండ్రీ ||నా యేసు!||

5వ చరణం

నా హృదయమే నిలిచిపోనీ నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ ధర పునాదులే కరిగిపోనీ యేసు నిరతంబు నీ ప్రేమ నిలుచు నను బ్రోచు ||నా యేసు!||

Report Error