నా యేసు రాజ్యము అందమైన
naa yeesu raajyamu andamaina
🎵 TG-2577🌐 Telugu
పల్లవి
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును (2) సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
1వ చరణం
అవినీతియే ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||
2వ చరణం
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం