నాది నాది అంటు వాదులాట నీకెందుకు

naadi naadi anttu vaadulaatta niikenduku

🎵 TG-1090💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నాది నాది అంటు వాదులాట నీకెందుకు ఏదినీది కాదు సత్యమిది ఎరుగ వెందుకు ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటినే వెదుకు (2) 1 నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయెనే నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోవునే క్షణికమైన వాటికొరకు ప్రాకులాట నీకెందుకు అక్షయ దైవ రాజ్యమే నిలుచును తుదవరకు 2 నీదగ్గర ధనముంటే నీచుట్టు మనుష్యులుంటారు నీలోపల బలముంటే నిను మా వాడని అంటారు నీధనము నీబలగం నీ చావునాపలేవు తప్పకుండ ఒక నాడు మట్టిలోన కలుస్తావు 3 నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు నీ యెక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు గడ్డి పూవులాంటిదేగదా ఇలలోన నీదు జీవితం యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్థకం

Report Error