నాదు జీవ మాయనే నా సమస్తము
naadu jeeva maayanee naa samasthamu
🎵 TG-1102🌐 Telugu
పల్లవి
నాదు జీవ మాయనే నా సమస్తము నా సర్వస్వం యేసుకే నా సు జీవము నాదు దైవము దివి దివ్య తేజము
1వ చరణం
క్రుంగిన వేళ భంగ పడినవేళ నాదరికి చేరెను చుక్కాని లేని నా నావలో నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను ||నాదు జీవ||
2వ చరణం
సాతాను బందీనై కుములు చున్న వేళ విడిపించె శ్రీయేసుడే రక్తా మంత కార్చి ప్రాణాలె భలి చేసి విమోచన దయచేసెను సాతానుని అనగా త్రొక్కా అధికార బలమిచ్చెను ||నాదు జీవ||
3వ చరణం
కారు మేఘాలే క్రమ్మినా వేళా నీతి సుర్యుడే నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవిత నావన్ త్వరలో ప్రభు దిగి వచ్చును తరలి పోవుదును ప్రభునితో ||నాదు జీవ||