నాదు జీవితము మారిపొయినది నిన్నాశ్రయించిన
naadu jeevithamu maaripoyinadi ninnaashrayinchina
🎵 TG-2183🌐 Telugu
పల్లవి
నాదు జీవితము మారిపొయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు||
1వ చరణం
చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా నే పాపినయ్యా ప్రభువా.. ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి..