నాదు ప్రాణము ప్రభుని మిగుల

naadu praannamu prabhuni migula

🎵 TG-124💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు చేయుచున్నది నాదు నాత్మ దేవునం దా నం మొందెను నిరతము ||నాదు ప్రాణము||

1వ చరణం

దేవుఁడు తన భృత్యురాలి దీనస్థితి లక్షించెను ఈ వసుంధరఁ దరము లన్నిఁక నెన్ను నను శుభవతి యని ||నాదు ప్రాణము||

2వ చరణం

సర్వ శక్తుఁడు మహాకృత్యము సంభవింపఁ జేసెను ఉర్విలో నా ప్రభుని నామం బోప్పు బరిశుద్ధంబుగా ||నాదు ప్రాణము||

3వ చరణం

భయము భక్తియుఁ గల్గి దేవుని భజనఁ జేసెడి వారికి నయముగాఁ దన కృప నొసంగు న నయమును దరతరములు ||నాదు ప్రాణము||

4వ చరణం

విదిత బాహువు చేత శౌర్యము విభుఁడు కనపర్చెను హృదయపుఁ దలఁపులను గర్వులఁ జెదరఁ గొట్టెను నిజముగ ||నాదు ప్రాణము||

5వ చరణం

ఆసనాసీనులై యున్న యతిశయాత్ములన్ బడఁ ద్రోసి దేవుఁడు దీనులను సిం హాసనంబుల నునిచెను ||నాదు ప్రాణము||

6వ చరణం

క్షుధితులను దన మధురములచేఁ గోరి తృప్తి పర్చెను అధిక ధనవంతులను రిక్త హస్తములతో ననిపెను ||నాదు ప్రాణము||

7వ చరణం

ఆది పితరులైన యబ్రా హాము కతని సంతున కద్వితీయుఁ డాదిలోక నాన తిచ్చినట్లుగా ||నాదు ప్రాణము||

8వ చరణం

నిరతమును దన కరుణఁ జూప నిజముగా మది నెంచెను వరదుఁ డిశ్రాయేలునకుఁ దన వర సహాయ మొనర్చెను ||నాదు ప్రాణము||

9వ చరణం

పరమ తండ్రికి దైవ సుతునకు పావనాత్మకు నిఁక నిహ పరమ లందును యుగయుగంబులఁ బరఁగు మహిమ మామేన్ ||నాదు ప్రాణము||

Report Error