నాకై చీలిన యుగ యుగముల

naakai cheelina yuga yugamula

🎵 TG-417💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక రక్షక నన్ను నీ లోపల దాగి వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ||నాకై చీలిన||

1వ చరణం

చీలఁబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్నుఁ బావనుఁ జేయు ||నాకై చీలిన||

2వ చరణం

నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు ||నాకై చీలిన||

3వ చరణం

నేను జేసిన పాపములఁ ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీనుఁ డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||నాకై చీలిన||

4వ చరణం

కట్టఁ బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి సహాయము లేక నీపై మదిఁ బుట్టి నీ సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య ||నాకై చీలిన||

5వ చరణం

పరమకల్మషుఁడనై నే నీటి ఋగ్గకుఁ బరుగు లెత్తెద నిప్పుడు పరమ పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర ||నాకై చీలిన||

Report Error