నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ
naavanni angeekarinchumee deevaa - nannepudu neevu karunninchumee
నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద
నీకు నా ప్రాణము నిజముగ నర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని అంగీకరించుమీ||
సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని - నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని అంగీకరించుమీ||
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు - ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని అంగీకరించుమీ||
పెదవులతో నేను బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి ||నావన్ని అంగీకరించుమీ||
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ - యావంత యైనను నాశించ మదిలోన ||నావన్ని అంగీకరించుమీ||
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే - సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు ||నావన్ని అంగీకరించుమీ||
చిత్తము నీ కృపా యత్తంబు గావించి - మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము ||నావన్ని అంగీకరించుమీ||
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి - పదిలంబుగా దాని బట్టి కాపాడుము ||నావన్ని అంగీకరించుమీ||