నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ
naavanni angiikarinchumii deevaa - nannepuddu niivu karunninchumii
పల్లవి
నావన్ని కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద
1వ చరణం
నీకు నా ప్రాణము నిజముగ నర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద
2వ చరణం
సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని - నిత్యంబు గరముల నీ సేవ జేసెద
3వ చరణం
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు - ఆశచే నడిపించు మరల నా పదములు
4వ చరణం
పెదవులతో నేను బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి
5వ చరణం
నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ - యావంత యైనను నాశించ మదిలోన
6వ చరణం
నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే - సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు
7వ చరణం
చిత్తము నీ కృపా యత్తంబు గావించి - మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము
8వ చరణం
హృదయంబు నీకిత్తు సదనంబు గావించి - పదిలంబుగా దాని బట్టి కాపాడుము