నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో
nannenthagaanoo preeminchenu – nannenthagaanoo
🎵 TG-2347🌐 Telugu
పల్లవి
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము – నా శాపము తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||
1వ చరణం
సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) పడనీయక దరి చేరనీయక తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||
2వ చరణం
సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను వర్ణింపగా లేను ఆ ప్రభువును కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును నా కోసమే యేసు శ్రమ పొందెను నా పాపమంతటిని క్షమియించెను ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును నను నేను ఆ ప్రభుకు సమర్పింతును