నన్ను దిద్దుము చిన్న ప్రాయము

nannu diddumu chinna praayamu

🎵 TG-325💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను ఁ జేరితి నాయనా ||నన్ను దిద్దుము||

1వ చరణం

దూరమునకుఁ బోయి నీ దరిఁ జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా రడవిఁ దిరిగితి నాయనా ||నన్ను దిద్దుము||

2వ చరణం

మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర పంచమందున నాయనా ||నన్ను దిద్దుము||

3వ చరణం

చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా నా చాల మొఱల నాలకించుము జాలిగల నా నాయనా ||నన్ను దిద్దుము||

4వ చరణం

జ్ఞాన మంతయుఁ బాడుచేసి కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను దిద్దుము||

5వ చరణం

కొద్ది నరుఁడను దిద్ది నను నీ యొద్దఁ జేర్చుము నాయనా నీ యొద్దఁ జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా ||నన్ను దిద్దుము||

6వ చరణం

ఎక్కడను నీవంటి మార్గము నెఱుఁగ నైతిని నాయనా నీ ఱెక్క చాటున నన్ను ఁ జేర్చి చక్కపరచుము నాయనా ||నన్ను దిద్దుము||

7వ చరణం

శత్రువగు సాతాను నన్ను మిత్రు ఁ జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా నేత్రముల కో నాయనా ||నన్ను దిద్దుము||

8వ చరణం

వాసిగా నేఁ బాపలోకపు వాసుఁడ నో నాయనా నీ దాసులలో నొకనిగా ననుఁ జేసి కావుము నాయనా ||నన్ను దిద్దుము||

Report Error