నన్ను ఁ గన్నయ్య రావె

nannu m gannayya raave

🎵 TG-377💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను ఁ||

1వ చరణం

ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను ఁ||

2వ చరణం

హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను ఁ||

3వ చరణం

కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను ఁ||

4వ చరణం

దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను ఁ||

5వ చరణం

నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను ఁ||

Report Error