నీ చల్లనైన నీడలో నన్ను

nee challanaina needaloo nannu

🎵 TG-2083🌐 Telugu
పల్లవి

నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2) నీ ప్రేమా నా లోనా ప్రతిక్షణం అనుభవించనీ (2)          ||నీ చల్లనైన||

1వ చరణం

మట్టి వంటిది నా జీవితం గాలి పొట్టు వంటిది నా ఆయుషు పదిలముగా నను పట్టుకొని మార్చుకుంటివా నీ పోలికలో మరణ భయమిక లేదంటివి మారా వంటిది నా జీవితం ఎంతో మదురమైనది నీ వాక్యం హృదయములో నీ ప్రేమా కుమ్మరించుమా జుంటి తేనెలా (ఆహా) మధురం మధురం నా జీవితం అల్పమైనది నా జీవితం ఎంతో ఘనమైది నీ పిలుపు నీ సేవలో నే సాగుటకు నను నింపుమా నీ ఆత్మ శక్తి తో నే ఆగక సాగెద నీ సేవలో

Report Error