నీ చల్లని నీడలో నీ
nee challani needaloo nee
🎵 TG-1479🌐 Telugu
పల్లవి
నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో (2) నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని||
1వ చరణం
కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజకులుగా చేసితివి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము