నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
nee cheethithoo nannu pattukoo - nee aathmathoo nannu nadupu
🎵 TG-1112🌐 Telugu
పల్లవి
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
1వ చరణం
అంధ కారా లోయలోన సంచరించిన భయములేదు నీ వాక్యం శక్తి గలది - నాత్రోవకు నిత్య వెలుగు (2) ||నీ చేతితో||
2వ చరణం
ఘోర పాపిని నేను తండ్రి - పాప ఊబిలో పడియుంటిని లేవ నెత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2) ||నీ చేతితో||
3వ చరణం
ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్ ||నీ చేతితో||