నీ జీవితం క్షణ భంగురం

nee jeevitham kssanna bhanguram

🎵 TG-2295🌐 Telugu
పల్లవి

నీ జీవితం క్షణ భంగురం గమ్యంబులేని వేదనల వలయం (2) నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం||

1వ చరణం

ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో గమనించుమా ప్రియ నేస్తమా (2)          ||నీ జీవితం||

2వ చరణం

కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)         ||నీ జీవితం||

Report Error