నే నీవాఁడనై యుండఁ గోరెదన్
nee neevaamdanai yundam gooredan
పల్లవి
నే నీవాఁడనై యుండఁ గోరెదన్ యేసు ప్రియ రక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్నుఁ జేర్చు నీదరిన్ ||నే నీవాఁడనై||
1వ చరణం
నన్నుఁ బ్రతిష్ఠపర్చుమీ నాధా నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్ ||నే నీవాఁడనై||
2వ చరణం
నీదు సన్నిధిలో నిఁక నుండ నెంత తుష్టి నాకగున్ స్నేహితుని మాటలాడెదన్ సర్వశక్త ప్రభుతో ||నే నీవాఁడనై||
3వ చరణం
నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నే ననుభవించెదన్ ||నే నీవాఁడనై||