నీ పద సేవయే చాలు
nee pada seevayee chaalu
🎵 TG-2493🌐 Telugu
పల్లవి
నీ పద సేవయే చాలు యేసు నాకదియే పది వేలు నీ పద జ్ఞానము నాకిలా క్షేమము నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద||
1వ చరణం
నీ నామమునే స్తుతియింపగను నీ వాక్యమునే ధ్యానింపగను (2) నీ రాజ్యమునే ప్రకటింపగను దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||
2వ చరణం
నీ దరినే నివసింపగను జీవమునే సాధింపగను సాతానును నే నెదిరింపగాను నీ ప్రేమను నే చూపింపగను నీ త్యాగమునే నొనరింపగను నీ సహనమునే ధరియింపగను