నీ సమాధానము దాసుని కిప్పుడు

nee samaadhaanamu daasuni kippudu

🎵 TG-125💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||

1వ చరణం

అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను ||నీ సమాధానము||

2వ చరణం

నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు చూచి యా నందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||

3వ చరణం

తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||

Report Error