నీధనము నీఘనము ప్రభు యేసుదే

needhanamu neeghanamu prabhu yeesudee

🎵 TG-1116🌐 Telugu
పల్లవి

నీధనము నీఘనము ప్రభు యేసుదే నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా

1వ చరణం

ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీధన||

2వ చరణం

పాడిపంటలు ప్రభువు నీకియగా - కూడుగుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా ||నీధన||

3వ చరణం

వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభునీకు ఉచితంబుగా వెలిగించ ధరయందు ప్రభు నామము - కలిమి కొలది ప్రభునకర్పించవా ||నీధన||

4వ చరణం

కలిగించే సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ భరితంభులు బలియాయె నీపాపముల కేసుడు - చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీధన||

5వ చరణం

పరిశుద్ద దేవుని మంధిరమున్‌ - పరిపూర్ణముగాను యోచించుడి పరిశుద్ధ బాగంబు విడదీయుడి - పరమాత్మ దీవెనలను బొందుడి ||నీధన||

Report Error