నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా
neekunna bhaaramantha prabhupai nunchu - kalavara chendakumaa
🎵 TG-1115🌐 Telugu
పల్లవి
నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా.. ఆయనె నిన్ను ఆధరించునూ - అద్భుతములు చేయున్
1వ చరణం
నీతి మంతులను కదలనీయడు - నిత్యము కాచి నడిపించును ||నీకున్న భారమంత||
2వ చరణం
మనలను కాచే దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును ||నీకున్న భారమంత||
3వ చరణం
తల్లి తండ్రి విడచినను - ఆయనే మనలను హత్తుకొనును ||నీకున్న భారమంత||
4వ చరణం
ప్రభువు మన పక్షమైయుండగా - ఎదురు నిలువ గల వాడెవ్వడు ||నీకున్న భారమంత||
5వ చరణం
ప్రభుకు జీవితం సమర్పించెదం - ఆయనే అంతా సఫలం చేయును ||నీకున్న భారమంత||
6వ చరణం
మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా ఆయనే మనలను ఆధరించును - అద్భుతములు చేయును.. ||నీకున్న భారమంత||