నీ...మధిలో నను తలచు ప్రభువా

nee...madhiloo nanu thalachu prabhuvaa

🎵 TG-1122🌐 Telugu
పల్లవి

నీ...మధిలో నను తలచు ప్రభువా... నీ...మధిలో నను తలచు నా ప్రభువా నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2)

1వ చరణం

ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2) నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2) ||నీమధిలో||

2వ చరణం

అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2) ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2) ||నీమధిలో||

3వ చరణం

చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2) చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును (2) ||నీమధిలో||

Report Error