నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
neenu velllleemaargamu - naayeesukee theliyunu
🎵 TG-1124🌐 Telugu
పల్లవి
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును (2) శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను (2) హల్లేలూయా...హల్లేలూయా....హల్లేలూయా..ఆమేన్ (2)
1వ చరణం
కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు ||హల్లే||
2వ చరణం
జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు ||హల్లే||
3వ చరణం
విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు ||హల్లే||