నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ

neerchukonaree yeesuvaaduka lanudinamu mee

🎵 TG-153💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందున నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో ||నేర్చుకొనరే యేసువాడుక||

1వ చరణం

ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే యేసువాడుక||

2వ చరణం

దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు ||నేర్చుకొనరే యేసువాడుక||

3వ చరణం

పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను ||నేర్చుకొనరే యేసువాడుక||

4వ చరణం

బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము జూపించి మేలును జేసిన విధంబు మీరలు ||నేర్చుకొనరే యేసువాడుక||

5వ చరణం

సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకొనరే యేసువాడుక||

6వ చరణం

అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల యక్కరలను జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే యేసువాడుక||

7వ చరణం

దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే యేసువాడుక||

Report Error