నీతిగల యెహోవా స్తుతి మీ

neethigala yehoovaa sthuthi mee

🎵 TG-2889🌐 Telugu
పల్లవి

నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి ||నీతి||

1వ చరణం

చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే

Report Error