నీతో గడిపే ప్రతి క్షణము

neethoo gadipee prathi kssannamu

🎵 TG-2883🌐 Telugu
పల్లవి

నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

1వ చరణం

మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||

2వ చరణం

గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు

Report Error