నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు

neethoo samamevaru? neelaa preemincheedevaru

🎵 TG-1109🌐 Telugu
పల్లవి

నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ? నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? (2)

1వ చరణం

వెండి బంగారము ధన ధాన్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా (2) జీవనదులన్నియూ సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు (2) || నీతో||

2వ చరణం

పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు (2) పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు (2) ||నీతో||

3వ చరణం

నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి (2) నీకు గాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు (2) ||నీతో||

Report Error