పల్లవి
నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే నా||
1వ చరణం
పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి ||నీవే నా||
2వ చరణం
నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే నా||
3వ చరణం
నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే నా||
4వ చరణం
నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే నా||
5వ చరణం
సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు ||నీవే నా||
6వ చరణం
నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే నా||