నీవు లేని రోజు అసలు

neevu leeni rooju asalu

🎵 TG-2343🌐 Telugu
పల్లవి

నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) నీవే లేకపోతే నేనసలే లేనయా (2)          ||నీవు లేని||

1వ చరణం

బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2)           ||నీవే||

2వ చరణం

ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2)       ||నీవే||

Report Error