నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా
neevvuntee naaku chaalu yeesayyaa
🎵 TG-1114🌐 Telugu
పల్లవి
నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను వుంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
1వ చరణం
ఎన్ని భాధలున్నను - ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన - నిష్టూరమైననూ ||నీ మాట||
2వ చరణం
బ్రతుకునావ పగిలిన - కడలి పాలైనను అలలు ముంచివేసినా - ఆశలు అణగారిన ||నీ మాట||
3వ చరణం
ఆస్తులన్నీ పోయిన - అనాధిగా మిగిలిన ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా ||నీ మాట||
4వ చరణం
నీకు ఇలలో ఏదియు - లేదు అసాద్యము నీదు కృపలో మాకేదియు - కాదిల సమానము ||నీ మాట||