నీ జీవితములో గమ్యంబు ఏదో - ఒకసారి యోచింపవా
nii jiivitamuloo gamyanbu eedoo - okasaari yoochinpavaa
పల్లవి
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు - నీ హృదయ మర్పించవా?
1వ చరణం
నీ తల్లి గర్బమున నీ వుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2) యోచించి నావా ఏరీతి నిన్ను - నిర్మించే తన చేతులు "నీ జీవిత"
2వ చరణం
నీ లోన తాను నివసింపగోరి - దినమెల్ల చే జాచెను (2) హృదయంబు తలపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను "నీ జీవిత"
3వ చరణం
తన చేతులందు హృదయంబు ధారల్ - స్రవియించె నీకోసమే (2) భరియించే శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా? "నీ జీవిత"
4వ చరణం
ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి - సమయంభు ఈ నాడేగా (2) ఈ చోటు నుండి ప్రభు యేసు లేక - పోభోకుమా సోదరా "నీ జీవిత"