నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము

nii mukhamu manooharamu - nii svaramu maadhuryamu

🎵 TG-1119💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన

1వ చరణం

నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య"

2వ చరణం

నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య"

3వ చరణం

నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"

Report Error