నీ వుండగా ఈ లోకంలో నాకేమి అక్కరలేదు

nii vunddagaa ii lookanloo naakeemi akkaraleedu

🎵 TG-1285💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నాకేది అక్కరలేదు నా దేవ నా ప్రభువా నీ తోడుయే నాకెంతో ధన్యకరము నా యేసువా నా రక్షకా

1వ చరణం

నా జన్మ ఏ పాటిదో తలపోసి భయమొందితిని ఈ ఓటి పాత్రను మహిమైశ్వర్యముతో నింపావు నా పాదమెపుడు నీ చెంత నుండ నాకేమి కొదువగును యేసయ్యా ||నీవుండగా||

2వ చరణం

తల్లి గర్బాన నుండి సాతాను సంబంధిని ఈ మట్టి పాత్రను కలుషంబులను కడిగావు నా నిండు మదిలో నా గుండె గదిలో నీ కన్న వేరే లేరయ్యా ||నీవుండగా||

Report Error